క్రీడాకారుడు సాయి సృజన్ కు అండగా బీజేపీ నేత డా.శైలేందర్ రెడ్డి
జగిత్యాల
:జిల్లా లోని రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి సత్యం గాయత్రిల కుమారుడు క్రీడాకారుడు సాయి సృజన్ కు బీజేపీ నేత,ప్రముఖ దంత వైద్యుడు
డాక్టర్.శైలేందర్ రెడ్డి నేనున్నానంటూ అండగా నిలిచారు… జగిత్యాల లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ పాఠశాలలో సృజన్
రెండవ తరగతి చదువుతూ కోచ్ రామాంజనేయులు సమక్షంలో కిక్ బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్నాడు.. గతంలో రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలో సృజన్
గోల్డ్ మెడల్ సాధించాడు..
అలాగే జార్ఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.. ఈ సమాచారాన్ని తెలుసుకున్న జగిత్యాల బీజేపీ నాయకులు డాక్టర్ శైలేందర్ రెడ్డి విద్యార్థిని అభినందించి జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి వచ్చే రవాణా ఖర్చులు అందించారు.. ఆటలు ఆడడం తో శారీరకంగా దృఢంగా ఉంటారని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని శైలందర్ రెడ్డి పేర్కొన్నారు..ఈ సందర్భంగా సాయి సృజన్ ను పలువురు అభినందించారు.. ఈ కార్యక్రమంలో కోచ్ రామాంజనేయులు, ఇతర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు