Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కోడెల శివరాం తిరుగుబాటు..?

0

గుంటూరు, జూన్ 3

సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో   కాక రేపుతోంది. పార్టీని నమ్మి  అధిష్టానం ఆదేశాలు తూచా తప్పుకుండా పార్టీ కోసం పాటు పడితే…వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పార్టీ ఇంచార్జ్ పదవులు ఇవ్వటం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు కోడెల కుమారుడు శివరాం.   సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ నియమకం పార్టీలో తీవ్ర అసహనానికి దారి తీసింది. సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పదవి‌ కోసం ప్రధానంగా ముగ్గురు నాయకులు రేస్ లో  ఉన్నారు. ఇందులో కోడెల కుమారుడు శివరాం ప్రధమ వరసలో ఉండగా…మాజీ ఎంఎల్ఏ వైవీ ఆంజనేయులు, టీడీపీ యువ నాయకుడు మళ్లీ ఆ తర్వాత పొజీషన్ లో ఉన్నారు…ఎవరి ప్రయత్నాలలో  వారు ఉన్నారు… వీరిలో ఎవరో ఒకరికి ఇంచార్జ్ పదవి దక్కుతోందని కాన్ఫిడెన్స్ లో ఉన్నారు.. పార్టీ కార్యక్రమాలను పోటిపడి మరీ నిర్వహించే వారు..ఆ ముగ్గురిని కాదని  కన్నా లక్ష్మీనారాయణకు ఇంచార్జ్ పోస్ట్ ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర మెగా మాసీవ్ మూవీ ‘భోళా శంకర్’- భోళా మానియా ఫస్ట్ లిరికల్ జూన్ 4న, సాంగ్ ప్రోమో జూన్ 2న విడుదల

టీడీపీ పార్టీలో జాయిన తర్వాత ఆయన దృష్టి పెద్దకూరపాడు, గుంటూరు పశ్చిమం వైపే ఉందన్న వార్తలు వచ్చాయి…కానీ నిన్న హటాత్తుగా సత్తెనపల్లి ఇంచార్జ్ గా నియమకం జరగడంతో ఆశావాహులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు.  కన్నా నియామకం వార్త వెలు వడిన వెంటనే తమ అనుచరులతో కోడెల శివరాం  సమావేశం ఏర్పాటు చేశారు. వైవీ ఆంజనేయులు, మల్లి కొంతవరకూ సర్థుకు పోయేందుకు సంసిద్దత‌ వ్యక్తం చేశారు . కానీ కోడెల కుమారుడు శివరాం మాత్ర ససేమిరా ఆంటున్నారు.  తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి నియోజకవర్గం లో ఆయన మరణం తర్వాత పార్టీ కోసం కష్టపడి పని చేశానని  చెబుతున్నారు. 2019 ఎన్నికలలో తన తండ్రి కోడెల ಓడిపోయన తర్వాత అధికార వైసీపీ పార్టీ నుంచి తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నామని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కుటుంబం  అనుభవించని  తీవ్ర అవమానాలు, పోలీస్ కేసులు ఫేస్ చేసామని చెబుతున్నారు…ఈ ఘోర అవమానాలు భరించ లేక తన తండ్రి  ఆత్మహత్య చేసుకున్నా ధైర్యంగా నియోజకవర్గంలో  పార్టీ బాద్యతలు చేపట్టామని ఆంటున్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసిన తనను కాదని వలస నాయకుడు కన్నాకు పదవి ఇవ్వడం తన ఆబిమానులు జీర్ణంచుకోలేక పోతున్నారని ఉంటున్నారు కోడెల శివరాం..అవకాశ రాజకీయాలకు కేరాఫ్ ఆయిన కన్నా కు నియోజకవర్గ ఇంచార్జ్   పదవి అప్పగించడం పార్టీకి కూడా శ్రేయస్కరం కాదంటున్నారు .మిగిలిన ఇద్దరు సైలెట్  అయిన కోడెల శివరాం మాత్రం దిక్కార స్వరం వినిపిస్తున్నారు.  తనకు  చంద్రబాబు నాయడు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయనంటున్నరాు.  ఐదు లక్షల‌ చందా రాస్తే మహానాడులో తనతో  కూర్చుని బోజనం చేసే అవకాశం చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు..పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన తన తండ్రి…తండ్రి ఆశయాలకు అనుగుణంగా పార్టీ‌కోసం  తామ కుటుంబం నిలబడిందని కాని చంద్రబాబు ఐదు నిమిషాలు కేటాయించక పోవడం  కోడెలను అవమానించడమే ఆంటున్నారు .  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా  ఉన్న కన్నా టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులను తాను మర్చిపోలేదని చెబుతున్నారు..కన్నా పెట్టించిన అక్రమ కేసుల నుంచి పార్టీ కార్యకర్తలను అనాడు  కాపాడింది తన తండ్రి అని తెలిపారు..  చంద్రబాబు తనను పిలిపించి మాట్లాడాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie