కొత్తగా రైతు బంధు కట్…
అదిలాబాద్, మే 19, (eeroju)
కొత్తగా భూ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న రైతులు రబీలో రైతుబంధు సాయం కోసం ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా వినిపించడం లేదు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే జూన్ 20 తరువాత వారసత్వం గాను, కొనుగోళ్ల ద్వారా వివిధ కారణాలతో భూ బదలాయింపు చేసుకొని కొత్త పట్టాపాస్ బుక్కులు, డిజిటల్ సంతకాలు పొందిన రైతులు 2400 మంది వరకు ఉన్నారు. ఇలాంటి వారు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉంటారు. రబీలో రైతుబంధు సహాయం కోసం సంబంధిత క్లస్టర్లలో దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం పోర్టర్ అందుబాటులో ఉంచకపోవడంతో వీరంతా రబీలో రైతుబంధు సహాయానికి దూరమయ్యారు. రబ్బీలో రైతుబంధు సాయం ఎగవైత కోసమే నమోదుకు పోర్టర్ ను అందుబాటులో ఉంచలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
భూ తొలగింపులకు రైతు బంధు సహాయం డబ్బులను మినహాయించుకుంది. చేర్పులకు అవకాశం ఇవ్వక రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసిందని రైతులు మండిపడుతున్నారు. వాన కాలంలో రైతుబంధు సాయం అందించేందుకు సమయం దగ్గర పడుతుంది. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొంది రబీలో రైతుబంధు సహాయానికి దూరమైన రైతులకు దరి చేరుతుందో లేదోని ఆందోళన పడుతున్నారు. రైతులకు వానకాలంలో రెండు విడతలు కలిపి ఒకేసారి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రబీ రైతుబంధు సహాయం తరువాత కూడా వారసత్వ కొనుగోళ్ల ద్వారా వివిధ కారణాలతో భూ బదలాయింపు చేసుకొని కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉంటారు.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకుబ్రేక్
వాన కాలంలో రైతుబంధు సాయం అందజేసే ప్రకటన వెలువడేలోపే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క రైతుల ప్రభుత్వమని, వ్యవసాయానికి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు అర్హులైన రైతులకు ఆర్థిక ఇబ్బందులు కలిగించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.రబీలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు రైతుబంధు సాయం డబ్బులు అందని మాట వాస్తవమే. జిల్లాలో 2400 మంది ఉన్నారు. ఈ సమస్య ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రైతుబంధు సాయం అందజేసే విషయం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంది.