తెలంగాణ కోసం….. కేంద్రం 4 లక్షల కోట్లిచ్చింది,అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోతున్నడు,కేసీఆర్ మూర్ఖత్వ పాలనతో తిరోగమనంలో తెలంగాణ
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గోన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, జి.వివేక్, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, రాణిరుద్రమదేవి, జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమకారులను స్మరించుకుంటూ, తెలంగాణ సాధన కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసింది. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే… ‘‘మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ కల సాకారం చేస్తాం.‘‘అంటూ సుష్మ స్వరాజ్ పార్లమెంట్ వేదికగా చెప్పడమే కాక తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించింది. పాతికేళ్ల క్రితమే ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతో కాకినాడ తీర్మానం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు.
తెలంగాణను అభివృద్ధి చేసేందుకు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. తెలంగాణలో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతుందోంటే కేంద్రం ఇచ్చిన నిధులతోనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. • రామగుండం ఫ్యాక్టరీ కోసం 6 వేల 338 కోట్లు, జాతీయ రహదారుల కోసం 1.10 లక్షల కోట్లు, ధాన్యం కొనుగోళ్ల కోసం లక్ష కోట్లకుపైగా చెల్లించాం. మొత్తంగా 4 కోట్ల ప్రజల కోసం 9 ఏళ్లలో 4 లక్షల కోట్లు కేటాయించింది.
కేంద్రం 4 కోట్ల ప్రజల కోసం 4 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తే… కేసీఆర్ మాత్రం నలుగురి కోసం పంచుకుంటూ తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేసింది. అభివృద్దిపై చర్చకు రమ్మని అడుగుతుంటే… చర్చకు రాకుండా కేసీఆర్ పారిపోతున్నడని ఆరోపించారు.
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేసింది. వాళ్ల బాధలను పంచుకుంది. సమస్యలన్నీ తెలుసుకున్నాకే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించాం. ఎందుకంటే విద్య కోసం ఒక్కో కుటుంబం సగటున రూ.లక్ష ఖర్చు చేస్తోంది. వాళ్లపై ఎనలేని భారం పడుతోంది. ప్రభుత్వ స్కూళ్లను చూస్తే అధ్వాన్నంగా మారాయి. కనీస వసతుల్లేవ్? చాక్ పీసులకు కూడా డబ్బుల్లేని దుస్ధితి. ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించి ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతాం. 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు.
భట్టి విక్రమార్క కు ఘన స్వాగతం
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చేతిలో బందీ అయ్యింది. తెలంగాణ బంగారమైతే… రైతుల ఆత్మహత్యల్లో ఎందుకు అగ్రస్థానంలో ఉంటుంది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటరు? జీతాలు రాక ఆర్టీసీ ఉద్యోగులెందుకు చనిపోతున్నరు? 317 జీవోవల్ల ఉద్యోగులెందుకు చెట్టుకొకరై నేలరాలిపోతున్నరు….అరే.. నిండు నూరేళ్ల జీవితమున్న ముక్కుపచ్చలారని విద్యార్థులెందుకు చనిపోతున్నరు? సింగరేణని అథోగతి పాలెందుకైంది. అన్ని శాఖల ఉద్యోగులు రోడ్డున పడ్డరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల పేదల పరిస్థితి దారుణంగా మారిందని అయన అన్నారు.
ఒక్కసారి ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమాలను గుర్తుకు చేసుకోండి. మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె స్పూర్తితో పోరాడదం. బీజేపీతో కలిసి రావాలని కోరుతున్నా. బీఆర్ఎస్ పార్టీని అంతమొందించడమే లక్ష్యంగా బీజేపీ చేసే పోరాటాలకు కలిసి రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని అయన అన్నారు.