Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కిషన్ రెడ్డా.. కొత్త సీఎం..?

0

ధర్మపురి అరవింద్ వాక్చాతుర్యంతో బిజేపి క్యాడర్ లో కొత్త జోష్ ని నింపారా? చెప్పకనే తమ పార్టీ సిఎం అభ్యర్థి ఎవరని హింట్ ఇచ్చారా? బండి సంజయ్ ని అధ్యక్ష పదవి మారిన రోజునుంచి ధర్మపురి అరవింద్ లో ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నారు. అంతకు ముందు వరకు సంజయ్ కు తనకు మధ్య ఏర్పడ్డ విబేధాలతో అరవింద్ చాన్నాళ్ళ పాటు ఇనాక్టివ్ గా ఉన్నారు. అరవింద్ ప్రవర్తనని చూసి అందరూ అతను పార్టీ మారిపోతున్నడెమో అన్న సందేహాలు వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు ఐదు నెలల పాటు వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ సిట్యుయేషన్ కనిపించింది. నిజామాబాద్ జిల్లాలో పలు నియోజకవర్గాలలో పలు టికెట్స్ విషయంలో అరవింద్ కి బండి సంజయ్ కి అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయని పార్టీ వర్గాలలో చర్చలు జరిగాయి. తాను కేవలం అధ్యక్షుడు మాత్రమే. టికెట్స్ విషయంలో తనకు అధికారం లేదంటూ సంజయ్ అరవింద్ డిమాండ్ ను సున్నితంగా తిరస్కరించారని చెప్పుకున్నారు. కానీ పార్టీ లో సంజయ్ పెత్తనం ఏ మాత్రం ఉందో తెలిసిన అరవింద్.. సంజయ్ కావాలనే తన కోరికను అవాయిడ్ చేస్తున్నాడని అనుకుని సంజయ్ కి దూరం అయ్యారని కూడా చెప్పుకున్నారు. ఈ విషయం లో నిజానిజాలు ఎలా ఉన్నా.. అధ్యక్షుడిగా సంజయ్ ని మార్చగానే మొట్ట మొదట ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేశారు అరవింద్. ఢిల్లీ లో కిషన్ రెడ్డి ని తెలంగాణ బిజేపి అధ్యక్షుడిగా అనౌన్స్ చేసిన కొద్ది సేపటికే అరవింద్ ధరపురి హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కిషన్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తారు. కిషన్ రెడ్డి సౌమ్యుడు, చదువుకున్నవాడు. అందరినీ కలుపుకుని పోయేవాడు అంటూ అరవింద్ ధర్మపురి స్టేట్మెంట్స్ చేశారు. ప్రెస్ మీట్ లో అరవింద్ ప్రదర్శించిన తీరు, పలికిన మాటలు.. సంజయ్ పై తనకున్న అభిప్రాయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు అనిపించాయి. బండి సంజయ్ వ్యవహార శైలి, కిషన్ రెడ్డి వ్యవహార శైలీలను పరోక్షంగా తెలిపే ప్రయత్నం అరవింద్ చేశారు అనిపించింది.

అధ్యక్షుడిగా ఉంటూ తానే సిఎం రేస్ లో ఉన్నాడని భావించిన సంజయ్ ను మాటల సురుకులతో అరవింద్ గేలి చేశారు అనిపించింది. సీఎం కేసీఆర్ విషయం లో కూడా.. రఘునందన రావు, ఈటల రాజేందర్ ల మాదిరి సౌమ్యంగా తను మాట్లాడలేనని అరవింద్ చెప్పారు. నిన్న స్టేట్ ఆఫీస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అరవింద్ ధర్మపురి సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేస్తూ.. అతని భాషలోనే అతనికి కౌంటర్ ఇస్తాను అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన బిజేపి నేత.. తెలంగాణ కు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ అరవింద్ చెప్పారు. వేదిక మీద ఉన్న ఒకరిని ఉద్దేశించి అరవింద్ ఆ స్టేట్మెంట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చలు మొదలుపెట్టాయి. కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రమాణస్వీకారం జరుగుతుంది అన్న మాటల వెనక ఈటలను ఇండైరెక్ట్ గా తమ పార్టీ తెలంగాణ అభ్యర్థి అంటూ అరవింద్ హిట్ ఇచ్చారనే అనిపిస్తోంది. తెలంగాణలో ఒక బిసి సామాజిక వర్గ నేత సిఎం కావాలంటే ఆ అవకాశం కేవలం బిజేపి లో మాత్రమే సాధ్యం ఉంది అని ఇప్పటికే అన్నీ వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. తలపండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం లో బిజేపి కూడా దాదాపు నాలుగేళ్లుగా బిసిలలో ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోసం ఛానాళ్ళు వెతుకులాడింది. వేతకబోయిన తీగ కాలికి తగిలినట్టు.. బీఆర్ఎస్ నుంచి బయటికి నెట్టివేయబడ్డ రాజేందర్ బిజేపిని ఆశ్రయించడం జరిగింది. రాజేందర్ బిజేపి లో చేరిన తొలినాళ్ళలో స్టేట్ బిజేపి, పార్టీ క్యాడర్ లో ఎన్నడూలేని ఓ సరికొత్త జోష్ కనిపించింది. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత అంతర్గత వైషమ్యాల వల్ల రాజేందర్ వెనకబడ్డారు. దాదాపు ఏడాదిన్నర సస్పెన్స్ తర్వాత ఈటలకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తోంది. కేసీఆర్ ను ఓడించడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్న ఈతలకు గడిచిన కొన్ని నెలలు అసంతృప్తితో సాగాయి. కిషన్ రెడ్డి ని అధ్యక్షుడిని చేస్తూ, తనని ఎన్నికల వ్యవహారాల కమిటీకి చైర్మన్ ని చేయడంతో.. వచ్చే ఎన్నికలలోనే బీఆర్ఎస్ అధినేతకు బుద్ధి చెప్పాలని నడుం బిగించారు. చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఈటల ఎలాంటి చేరికలు చేయలేకపోయాడు ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు అంటూ అతని మీద నెగెటివ్ ప్రోపగండా చేస్తున్నాయి యాంటీ ఈటల వర్గాలు. 2014 లో మోడి బిజేపి కి ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉంటూనే పీఎం అభ్యర్థిగా తనను తాను ప్రోమోట్ చేస్కున్నారు.. తెలంగాణలో ఈటల కూడా అదే విధానాన్ని అవలంభిస్తారు అంటున్నారు ప్రొ ఈటల గ్యాంగ్ మొత్తం. అరవింద్ పరోక్షంగా పేర్కొన్నట్టు, కేంద్ర బిజేపి ఎప్పటినుంచో ఎదురు చూసిన బిసి వర్గానికి చెందిన వ్యక్తి అయినందుకు గాను.. ఈటలనే తెలంగాణ బిజేపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింపబడతారా అనేది చాలా మంది ఎదురుచూస్తున్న అంశం.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie