ఎంపీ ఆదాలపై దుష్ప్రచారం మానుకోవాలి ,కోటంరెడ్డి సోదరులకు స్వర్ణ హెచ్చరిక
నెల్లూరు
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని దక్షిమధ్య రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణవెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం నెల్లూరులోని ఎంపీ ఆదాల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ సోదరులు మాట్లాడారు.రూరల్ నియోజకవర్గంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములకు తీవ్ర భయం పట్టుకొని పాదాలపై ురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నీచమైన రాజకీయాలు చేయడంలో కోటంరెడ్డి
సోదరుల్లో దిట్టలని విమర్శించారు.రాష్ట్రంలోనే క్రైస్తవ సోదరులందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.4గేళ్లగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి,100ల కోట్ల రూపాయలు దోచుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులు,చౌకుబేర రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.ఇకనైనా ఇటువంటి చిల్లర ,నీచమైన రాజకీయాలు మానుకోవాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవి ఈ సందర్భంగా అన్నారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాష్ట్రం నుండి కాక,కేంద్రం నుండి కూడా నిధులు తీసుకురాగల సత్తా ఉన్న ఏకైక నాయకుడని పేర్కొన్నారు.
కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టే కార్యక్రమాలు రూపొందించడంలో, చిచ్చు రాజేయడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులు ఆరితేరిపోయారన్న
విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజల మనిషి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జోలికి వస్తే, ఖబర్దార్ అంటూ క్రైస్తవ సోదరులందరూ ఏకవచనంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులకు హెచ్చరికలు చేశారు.
చంద్రబాబుకు గంగవ్వ సారీ.
నెల్లూరులోని క్రిస్టియన్ సోదరులకు సంబంధించి స్మశాన వాటికకు స్థలమును, నిధులను కేటాయించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. మీ నీచమైన రాజకీయ డ్రామాలు వేషాలతో క్రైస్తవులు మధ్య విభేదాలు సృష్టించి లాభం పొందాలనుకుంటే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మీ సోదరుడు గిరిధర్ రెడ్డిలు భూస్థాపితం కావడం ఖాయమని క్రైస్తవ సోదరులు హెచ్చరించారు.అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న పెద్దలు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్చార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఇకనైనా విష ప్రచారంమానుకోవాలని క్రైస్తవ సోదరులు ముక్తకంఠంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులకు హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో తాళ్లూరు సురేష్, క్రిస్టియన్ సోదరులు రాజేష్, దాసు, బెల్లంకొండ వెంకయ్య, ఆనంద్ ,సుధీర్ పాస్టర్, గంటా శ్యామ్, దరిశి విజయ్, కనపర్తిపాడు గ్రామం నుండి క్రిస్టియన్ అసోసియేషన్ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.