ఉగ్రవాదం వీడితేనే పాక్‌తో మైత్రి : మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ మే 20
పొరుగుదేశమైన పాకిస్థాన్‌తో సంబంధాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో సాధారణ సంబంధాలనే భారతదేశం కోరుకుంటోందని, అలా జరగాలంటే ఆ దేశం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టాలని, అది ఆ దేశ భాద్యత అని అన్నారు. జపాన్‌లో జరుగనున్న జీ-7 సదస్సుకు హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ హిరోమిషా చేరుకున్నారు. దీనికి ముందు ‘నిక్కీ ఆసియా’ పైనాన్షియల్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తోందని, ఉగ్రవాదం, శాంతి అనేవి ఒకే ఒరలో ఇమడవని భారతదేశం పదేపదే చెబుతూ వస్తోంది. ఇటీవల గోవాలో జరిగిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం గోవాలో జరిగినప్పడు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరైనప్పటికీ, భుట్టోకు, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు మధ్య ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు చోటుచేసుకోలేదు.
కాగా, ప్రధానమంత్రి మోదీ తన ఇంటర్వ్యూలో చైనాతో సంబంధాల విషయంలోనూ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇండియా కట్టుబడి ఉంటుందని చెప్పారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దు వివాదం విషయంలో శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని అన్నారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగానే ఇండో-చైనా మధ్య భవిష్యత్ సంబంధాలు ఆధారపడి ఉంటాయన్నారు. సాధారణ సంబంధాల పునరుద్ధరణతో ఆయా దేశాలతో పాటు యావత్ ప్రపంచానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరిపై సమాధానమిస్తూ, ఇండియా ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుందన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ నిరసన
రెండు దేశాల యుద్ధం వల్ల ఆహారం, ఇంధనం, ఎరువులు, నిత్యవాసరాల ధరలు పెరిగి జనం ఇబ్బందులకు గురవుతారని, అలాంటి వారికి అండగా నిలిచేందుకు భారత్ ముందుంటుందని అన్నారు. ఇరుదేశాలతో సమాన సంబంధాలు కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మోదీ చెప్పారు. జపాన్‌తో సంబంధాలను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సహజ న్యాయం వంటివి రెండు దేశాలను దగ్గర చేశాయని అన్నారు. జీ-7 సదస్సులో కనెక్టివిటీ, సెక్యూరిటీ, ఆర్థిక భద్రత, ప్రాంతీయ వివాదాలు, వాతావరణ మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్య భద్రతతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీపైనా ప్రధానంగా చర్చిస్తారని తెలిపారు.