ఈనెల 10న రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలతో అఖిలపక్ష సమావేశం
తెలంగాణ రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం అద్యక్షులు వేముల రామకృష్ణ,
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద 10వ తేదీన విద్యార్థి అఖిలపక్ష సమావేశం విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం అద్యక్షులు వేముల రామకృష్ణ వేముల రామకృష్ణ, పిలుపు నిచ్చారు.ఓయు లో మీడియా సమావేశం లో ఎన్ఐఎం శ్రీకాంత్ యాదవ్, సుమంత్ పిడిఎస్యు క్రాంతి, కట్ట హరీష్, మోడీ రాందేవ్,మున్నా, ఉప్పందర్, ప్రదీప్, రాము, చరణ్ ,వంశీ, ప్రవీణ్ విద్యార్ధి సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు..
ఈ అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలో అన్నీ విద్యార్ధి సంఘ నాయకులు పాల్గొంతున్నారని తెలిపారు.. ముఖ్య అతిధి జాతీయ బి.సి సంక్షేమ సంఘ అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సభను ఉద్దేశించి ప్రసంగిస్తారాణి తెలిపారు.రాష్ట్రమ లో1200 మంది విద్యార్థులు అత్మబలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కానీ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని విమర్శించారు. కమిషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్, డిజైనింగ్ ఫ్లైఓవర్, స్కై ఓవర్, సీఎం క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కలెక్టరేట్ భవనాలు సెక్రటేరియట్ కట్టడానికి నిధులు ఉంటాయి కానీ పేద విద్యార్థులు చదువుకోడానికి నిధులు ఉండవా అని ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేయక యాజమాన్యాలు సర్టిఫికెట్ మరియు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయం లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని ప్రగాఢ బాలు పలికిన కేసీఆర్ 10 సంవత్సరాలు గడుస్తున్న ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదని ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మా మనుమడు ఎలాంటి భోజనం చేస్తారో అలాంటి భోజనం సంక్షేమ హాస్టల్స్ లో ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసీఆర్. పెరిగిన నిత్యవసర వస్తువులకు అనుగుణంగా మిస్ చార్జీలు చెల్లించకపోవడంతో నాసిరక భోజనం సేవిస్తూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు.
ఈనెల 10న రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలతో అఖిలపక్ష సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు – సంక్షేమ కాలేజ్ హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు చాలిచాలని అద్దభవనాలలో ఇరుకు గదిలలో ఐదుగురు ఉండాల్సిన చోట 30 నుండి 35 మంది విద్యార్థులను గొర్రెల మందలాగా, బర్రెలమందల్లాగా ఉంచుతున్నారు. రాష్ట్రం ఏర్పాట తర్వాత ప్రైవేటు విద్యాసంస్థలను పెంచి పోషిస్తున్నది. కనీసం ఈ రాష్ట్రంలో విద్య హక్కు చట్టం అమలవుతుందా? ఈ రాష్ట్రంలో 80 శాతం పైగా విద్యా సంస్థలు అధికార పార్టీ నాయకులవే. ప్రైవేటు యూనివర్సిటీ పేర్లతో రిజర్వేషన్లు తొలగించి రకరకాల కోర్సులు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను నిలుదోపిడి చేస్తున్నాయి.