మదనపల్లె
జగన్మోహన్ రెడ్డి బీద పలుకులు పలుకుతూ ఏదో చాలా పేదవాడైనట్టు మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సిగ్గేస్తుందని జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాసు చౌదరి విమర్శించారు.అన్నమయ్య జిల్లా మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి,జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పలుకుల పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకానికి ఇవ్వవలసిన బకాయిలు దాదాపు 1000 కోట్లు పైగా చెల్లించక పోవడంతో ఆరోగ్యశ్రీ కింద ఉన్న ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం, డాక్టర్లు ఆందోళన చెపట్టారని పేర్కొన్నారు. నవరత్నాల సంగతి ఏంటో కానీ నవనిర్మాణాలైతే బెంగళూరు, తాడేపల్లి, ఇడుపులపాయ, కడపలో, హైదరాబాదు లోటస్పాండ్, ఇలా తొమ్మిది కోటల నిర్మించి జీవిస్తా ఉండే జగన్మోహన్ రెడ్డి నిజంగానే పేదవాడని ఎద్దేవా చేశారు.