అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై అదనపు సుంకం తగ్గింపు నష్టదాయకం. ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి.
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే అనేక ఒప్పందాలపై సంతకాలు చేయడం చాలా అన్యాయమని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి తెలిపారు బుధవారం రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బటానీలు, ఆపిల్, మెంతులతో సహా 8 వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న అదనపు సుంకాలను ఎత్తివేస్తామని ప్రకటించి సంతకాలు చేయడం పట్ల అమెరికాకు మోడీ సర్కార్ మోకరిల్లడం చాలా బాధాకరమైన విషయమని ఆయన తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి..
భారత్ తో పోలిస్తే అమెరికా రైతులకు అందే రాయితీలు చాలా ఎక్కువ, వారు సాగు చేసే విస్తీర్ణం కూడా అధికమే పూర్తిస్థాయి యాంత్రీకరణ మూలాన సాగు ఖర్చులు కలిసి వస్తాయి అంత భారీ స్థాయిలో ఉత్పత్తిదారుల నుంచి వ్యవసాయ పంటలను ఇక్కడకు దిగుమతికి చేయడం ళలన దేశంలో సన్న కారు రైతులు ఆ పోటీలో నిలిచి గట్టెక్కలేరని తీవ్ర నష్టాలు చవిచూస్తారని దీనివల్ల దేశ వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకు పోతుందని ఆయన తెలిపారు. భారత్ నుంచి ఉక్కు అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ప్రతిగా ఈ ఒప్పందానికి మోడీ సర్కార్ అంగీకరించినట్లు తెలుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య పాల్గొన్నారు