Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అనంతపురంలో క్రెడిట్ వార్.

0

ఏపీలో ఇప్పుడు ఏ అభివృద్ధి పని జరిగినా క్రెడిట్‌ వార్‌ మాత్రం కామనైపోయింది. మేం పునాది వేశామని ఒకరంటే… మేం పూర్తి చేశామని మరొకరు కౌంటరిస్తూ… పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్నారు. పై నుంచి కింది దాకా అన్ని దశల్లో ఇదే వరస. ఇప్పుడు అనంతపురంలోని ఓ వంతెన కూడా ఈ వార్‌లో నలిగిపోతూ… అసలు నన్నెందుకు కట్టార్రా నాయనా…అని ఆత్మఘోష వెళ్ళబోసుకుంటోందట. అనంతపురం వాసుల ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెడుతూ… టవర్ క్లాక్ దగ్గర ఫ్లైవోవర్‌ నిర్మించారు. గతంలో ఇక్కడున్న పాత బ్రిడ్జి బాగా దెబ్బతిని.. పెరిగిన ట్రాఫిక్ కి అనుకూలంగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఐ ప్యాక్ ఎఫెక్ట్.. కార్యరంగంలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..

అదే సమయంలో అనంతపురం మీదుగా చెన్నై- బళ్లారి జాతీయ రహదారి విస్తరణ పనులు జరిగాయి. ఈ ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉన్నా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక పనుల వేగం పెరిగింది.సుమారు 311 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనంతపురం ఎంట్రన్స్‌లో ఉన్న పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్డు వరకు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా టవర్ క్లాక్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. 15 నెలల్లోనే పాత బ్రిడ్జి కూల్చివేయడం, కొత్తగా రెండు వరుసల్లో కొత్త ఫ్లై వోవర్‌ కట్టడం జరిగిపోయాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల నగర రూపు కూడా మారిందన్నది లోకల్‌ టాక్‌. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కొత్త బ్రిడ్జి మీద వైసీపీ నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

 

అదే రోజు రాత్రి విద్యుత్ దీపాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ క్రెడిట్ అంతా వైసీపీదేనని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. సరిగ్గా ఇక్కడే టిడిపి నేతలు ఎంటరైపోయారు. అసలు ఈ ఫ్లైవోవర్‌ మా పుణ్యమేనంటూ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి దగ్గరికి చాలాసార్లు వెళ్లి బ్రిడ్జి కోసం ప్రయత్నాలు చేశామని, అది టీడీపీ హయాంలోనే మంజూరైందని చెప్పుకుంటున్నారట ఆ పార్టీ నేతలు. దీని మీద వైసిపి, టిడిపి నాయకుల మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది. మేం శాంక్షన్‌ చేయించుకు వచ్చామన్నది టీడీపీ వెర్షన్‌ కాగా…అంత సీన్‌ ఉంటే.. పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నది వైసీపీ క్వశ్చన్‌.

 

ఆ రెండు పార్టీలు అలా పోట్లాడుకుంటే… మేమున్నామంటూ మధ్యలో ఎంటరైపోయారు బీజేపీ నాయకులు. బ్రిడ్జి క్రెడిట్‌ మొత్తం మాదంటూ గట్టిగా వాయిస్‌ వినిపిస్తున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో వంతెన కడితే… మధ్యలో మీ పెత్తనమేందన్నది కాషాయ పార్టీ క్వశ్చన్‌. కష్టమైనా నష్టమైనా అంతా మాదేనని, క్రెడిట్‌ మాకే దక్కాలని అంటున్నారట బీజేపీ నేతలు. మేం తెచ్చిన నిధులతో వాళ్ళు సోకులు చేసుకుంటున్నారని విమర్శిస్తోంది అనంతపురం కమలదళం.అసలు మాది, మీది అని కొట్టుకోవడానికి వీళ్లంతా ఎవరు? అది జనం సొమ్ముతో… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగిన నిర్మాణం కదా అన్నది కామన్‌ మ్యాన్‌ వాయిస్‌. ఆ విషయాన్ని పక్కనబెట్టి మూడు పార్టీలు క్రెడిట్‌ వార్‌కు దిగడం జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది.

పల్నాడులో జాన్ బీ శపధం.

నిర్మాణ పరమైన క్రెడిట్‌ కోసం కొట్టుకోవడం ఒక ఎత్తయితే….ఇప్పుడు ఇంకో రకమైన రాజకీయం రంజుగా నడుస్తోంది. బ్రిడ్జిని అయితే తాత్కాలికంగా ప్రారంభించారు..కానీ.. ఇంకా పేరు పెట్టలేదు. సీఎం జగన్ చేత గ్రాండ్‌గా రిబ్బన్‌ కత్తిరించి బ్రిడ్జికి పేరు పెట్టాలని భావిస్తున్నారు వైసీపీ నాయకులు. మిగిలిన పార్టీలు, ప్రజా సంఘాలు మాత్రం పూలే, అంబేద్కర్, అబ్దుల్‌ కలాం, తరిమెల నాగిరెడ్డి ,నీలం సంజీవరెడ్డి ఇలా రకరకాల పేర్లు సూచిస్తున్నాయి. ఈ విషయంలో కూడా పొలిటికల్‌ వార్‌ జరుగుతూనే ఉంది. జనం మాత్రం క్రెడిట్‌ ఎవరన్నా తీసుకోనీ… ఎవరి పేరైనా పెట్టుకోనీ…మాకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరాయని హ్యాపీగా ఉన్నారు. రాజకీయ నాయకుల బారసాల తిప్పల్ని మాత్రం ఆసక్తిగా గమనిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie