కాకినాడ
రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వై డి రామారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. చదువు, కెరీర్ గురించి ఆలోచించాలి తప్ప ఇతరత్రా ఆకర్షణకు లోను కారాదన్నారు. చిన్నతనం నుంచి నైతిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని అన్నారు. ఒక్కొక్క విద్యార్థికి వెయ్యి రూపాయలు చొప్పున నగదు బహుమతి అందజేసిన కొప్పిశెట్టి సురేష్- అనిత దంపతుల సేవా నిరతి ప్రశంసనీయమని రామారావు తెలిపారు.
నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో #Nikhil20 టైటిల్ ‘స్వయంభూ’, ఫెరోషియస్ ఫస్ట్-లుక్ విడుదల
ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు రేయింబవళ్లు కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి పిల్లలను చదివిస్తున్నందున వారు మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. శ్రీ నగేష్, రాజా, చందర్రావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.