- సానుభూతి కోసం ప్లాన్ వేసుండొచ్చన్న రేవంత్
- పీకే తో కలిసి నాటకాలకు తెరతీశారని విమర్శ
- 12 నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్య
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
తెలంగాణ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు ప్రకటించారు. అయితే ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు.
మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ఈ ప్లాన్ వేసుండొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి నాటకాలకు తెర తీశారని ఎద్దేవా చేశారు. పీకే సూచనలతో కొత్త డ్రామాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. మరో 12 నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
Next Post