ఈ రెండు తేదీల్లో ఎప్పుడైనా వస్తాం: ‘భీమ్లా నాయక్’ చిత్రబృందం ప్రకటన

పవన్ కల్యాణ్ హీరోగా, రానా ప్రతినాయక పాత్రలో నటించిన చిత్రం భీమ్లా నాయక్. వరుసగా పెద్ద సినిమాలు విడుదల తేదీలు ప్రకటిస్తున్న నేపథ్యంలో, ‘భీమ్లా నాయక్’ చిత్రబృందం కూడా స్పందించింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగేందుకు ఎదురుచూస్తున్నామని, భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేస్తామన్న మాట నిలబెట్టుకుంటామని పేర్కొంది. పరిస్థితులు అనుకూలిస్తే ‘భీమ్లా నాయక్’ ను ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని, లేకపోతే ఏప్రిల్ 1న తీసుకువస్తామని చిత్రబృందం వెల్లడించింది.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ (మార్చి 25), ఆచార్య (ఏప్రిల్ 29) తమ విడుదల తేదీలు ప్రకటించడం తెలిసిందే. ఈ వేసవిలో పెద్ద సినిమాలు వస్తుండడంతో సినీ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.