ఈటల రాజేందర్ కు చెందిన జమునా హేచరీస్ భూములను కబ్జా చేసింది: మెదక్ జిల్లా కలెక్టర్

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతి నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని చెప్పారు. హకీంపేట, అచ్చంపేట పరిధిలో 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సర్వేలో వెల్లడయిందని అన్నారు. జమునా హేచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసిందని చెప్పారు. అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారని, పెద్దపెద్ద షెడ్లను నిర్మించారని తెలిపారు.

జమునా హేచరీస్ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లను నరికి రోడ్లు వేశారని జిల్లా కలెక్టర్ చెప్పారు. హేచరీస్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్టు గుర్తించామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తామని తెలిపారు.
Tags: Etela Rajender, BJP Medak District, Collector, Jamuna Hatcheries

Leave A Reply

Your email address will not be published.