‘పుష్ప’ ఐటమ్ సాంగులో సమంత.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప’ తొలి భాగంలో ఐటమ్ సాంగ్ లో తళుక్కుమనే అందాలభామ ఎవరో తెలిసింది. అదిరిపోయే ఐటమ్ గీతంలో బన్నీ సరసన సొట్టబుగ్గల సమంత కనువిందు చేయనుంది. తమ ఆఫర్ ను సమంత అంగీకరించిందని, ఐటమ్ నెంబర్ కు ఓకే చెప్పిందని పుష్ప నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ‘పుష్ప’లో ఐదో సాంగ్ చాలా స్పెషల్ అని, అందుకే స్పెషల్ భామ కావాల్సి వచ్చిందని వివరించింది. ఈ సందర్భంగా సమంతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్విట్టర్ లో పేర్కొంది.

‘పుష్ప ది రైజ్’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ పోషిస్తుండగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. కాగా, సునీల్, అనసూయ గెటప్పులు సోషల్ మీడియాలో విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రొటీన్ కు భిన్నంగా ఉండడంతో వారి పాత్రలపై ఇప్పటినుంచే ఆసక్తి మొదలైంది.

Leave A Reply

Your email address will not be published.