సినిమా కబుర్లు.. ‘ఫ్రీడమ్@మిడ్ నైట్ 11 మి వ్యూస్..

* కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తాజాగా ‘ఫ్రీడమ్@మిడ్ నైట్’ అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఈ చిత్రాన్ని ఆన్ లైన్లో విడుదల చేయగా, భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే దీనికి 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
* అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగును ఈ నెల రెండవ వారం నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుంది.
* ఇటీవలే ‘నారప్ప’ చిత్రాన్ని పూర్తిచేసి, ప్రస్తుతం ‘ఎఫ్ 3’ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ నటుడు వెంకటేశ్ తన తదుపరి చిత్రాన్ని ‘పెళ్లిచూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రం షూటింగును మే నెల నుంచి నిర్వహిస్తారని తెలుస్తోంది.
* బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రంలో యంగ్ హీరో నారా రోహిత్ గెస్ట్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఆయన యంగ్ ఎమ్మెల్యే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.
Tags: Anupama Parameshvaran, Nagarjuna, Venkatesh Daggubati, Nara Rohith

Leave A Reply

Your email address will not be published.