బిట్ కాయిన్ కరెన్సీ రద్దుకు కేంద్రం కసరత్తు

ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది. అమెరికాకు డాలర్.. ఇండియాకు రూపాయి.. ఇక ప్రపంచమంతా ప్రస్తుతం ఈ డాలర్లపైనే వ్యాపారం చేస్తున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన క్రిప్టో కరెన్సీ లేదా బిట్ కాయిన్ (ఆన్ లైన్ కరెన్సీ) ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. అయితే దీంతో నేరాలు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. క్రిప్టో కరెన్సీ నిషేధం దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇందుకోసం తాజా బడ్జెట్ సమావేశాల్లోనే ఓ బిల్లును రూపొందించింది.’ది క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులరేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్-2021′ పేరుతో రూపొందించిన ఈ బిల్లును తాజాగా బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్నారని సమాచారం.ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ క్రిప్టో కరెన్సీ స్థానంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ‘అధికారిక డిజిటల్ కరెన్సీ’ని తీసుకొస్తుందని.. దాని నియమావళి రూపకల్పనకు ఈ బిల్లు తోడ్పడుతుందని సమాచారం.

క్రిప్టోకరెన్సీ సాంకేతిక నేపథ్యం ఆధారంగా దేశంలో రుపీ డిజిటల్ వెర్షన్ ను తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోందట.. ఆన్ లైన్ లో కూడా భారత ప్రభుత్వం గుర్తించే కరెన్సీ ఉండేలా భావిస్తున్నారట.. అధికారిక డిజిటిల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు అవసరమైన నియమావళిని రూపొందించేందుకు దేశంలో ప్రైవేటు క్రిప్టోకరెన్సీని నిషేధించే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకొస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు దేశంలో ఏప్రిల్-2018లో ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధించింది. ఆ తర్వాత ఉపసంహరించుకుంది. 2019లోనూ ఇలాంటి బిల్లును రూపొందించారు. బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ కలిగి ఉన్నా.. విక్రయించినా దేశంలో పదేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించారు. కానీ అప్పుడు కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం దీని నిషేధం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.