సచివాలయ ఉద్యోగుల బదిలీలు … కలెక్టర్ సీరియస్
అనంతపురం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులను బదిలీ చేస్తూ తూ ఓ ఉన్నతాధికారి వివాదస్పద నిర్ణయం తీసుకున్నారని కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. శనివారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో దీనిపై చర్చ జరిగిందని అంతా చూసినట్టే చెప్పారు. సచివాలయ కార్యదర్శుల బదిలీలు జరిగితే వేతనాల మంజూరు లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఉద్యోగుల్లో ఆందోళన రేపారు.
ఈ రూమర్స్ పై కలెక్టర్ గంధం చంద్రుడు స్పందించారు. జిల్లాలో ఎలాంటి బదిలీలు జరగడం లేదని ఒక ప్రకటన లో స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, కార్యదర్శుల బదిలీలు జరుగుతున్నాయన్నది పూర్తిగా తప్పుడు సమాచారమని, దీన్ని ఎవరు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు.