ప్రియుడు కోసం పెళ్లి ఆపిన పెళ్లికూతురు… అంతా షాక్
సినిమా సీన్ ను తలపించే సంఘటన తమిళనాడు లో జరిగింది. తాళికట్టే సమయంలో పెళ్లి ఆగిపోయింది. అయితే, ఆ పెళ్లి ఆపింది ఎవరో కాదు.. పెళ్లిపీటలపై కూర్చున్న వధువే. వరుడు తాళికట్టే సమయంలో ఆ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పింది. తన ప్రియుడు అరగంటలో వస్తాడని, అప్పటి వరకు పెళ్లి ఆపాలని పట్టుబట్టింది. దీంతో వరుడితో పాటుగా అక్కడ ఉన్న బంధువులు అందరూ షాక్ అయ్యారు. పెళ్ళికి వచ్చిన పెద్దలు, బంధువులు వధువుకు నచ్చచెప్పాలని చూశారు. కానీ, వినలేదు. దీంతో వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత సేపు అక్కడ వెయిట్ చేసినా వధువు చెప్పిన ప్రియుడు రాకపోవడంతో పెళ్లికూతురిని అక్కడే వదిలేసి బంధువులు వెళ్లిపోయారు. ఈ సంఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జరిగింది.