మందు బాబులం… మేం మందుబాబులం
అనంతపురంలో ఇద్దరు మందుబాబులు హల్ చల్ చేశారు. మందు బాబులం మేం మందుబాబులం అంటూ ఓ రేంజ్ లో గందరగోళం సృష్టించారు. పాతూరులోని అన్నా క్యాంటీన్ ఎదురుగా ఇద్దరు వ్యక్తులు ఫుల్ గా మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. మురుగు కాలువ, చెత్తకుండి అనే బేధం లేకుండా.. పడూతూ లేస్తూ కొట్టుకున్నారు. స్థానికులు సర్ది చెప్పాలని చూసినా.. వినలేదు సరికదా.. మరింత హంగామా చేశారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చి వారిని పంపించి వేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని.. తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. సుమారు గంటపాటు ఈ తతంగం జరుగుతున్నా.. పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చినా పోలీసులు రాకపోవడం ఇక్కడ అసలు విశేషం.