మట్టిదిబ్బలో బంగారం…!

*రోడ్డు పక్కన మట్టిదిబ్బల్లో బంగారు నాణేలు... ఎగబడిన జనం!* తమిళనాడులోని హోసూరులో రోడ్డు పక్కన ఉన్న మట్టిదిబ్బల్లో బంగారు నాణేలు బయటపడ్డాయి. హోసూరు-బాగలూరు రహదారి వెంట ఉన్న ఆ మట్టి దిబ్బలో బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. స్థానికులతో పాటు రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా బంగారు నాణేల కోసం పోటీలు పడ్డారు. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాగా, ఒక్కో నాణెం 2 గ్రాముల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు పురాతన నాణేలుగా భావిస్తున్న వీటిపై అరబిక్ లిపిలో అక్షరాలు దర్శనమిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న హోసూరు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మట్టి దిబ్బల్లోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.