పాముల సయ్యాట.. జనం కంగారు
ఎక్కడైనా పాము కనిపిస్తే… ఆమడదూరం పరిగెడుతాం.. కాని రెండు పాములు ఒక్కసారిగా కనిపిస్తే.. ఇక జనం అటు వైపు చూడరు. కాని రెండు పాములు లోకాన్నే మరచిపోయి సయ్యాట ఆడుతూ కనిపించాయి. శింగనమల జూనియర్ కళాశాల ఆవరణంలో ఈ సంఘటన జరిగింది. పట్టపగలు జనం తిరుగుతన్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా పాములు సయ్యాటలో మునిగిపోయాయి. సుమారు గంటకు పైగా అవి అక్కడే ఉండిపోయాయి. కొందరు స్థానికులు ఈ పాముల సయ్యాటను తమ సెల్ ఫోన్లలో బంధించడంతో అది వైరల్ అయింది.