సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం 18 రోజులు సభ నిర్వహించాలని సూచించింది.కొవిడ్ నేపథ్యంలో.. సమావేశాల కోసం పార్లమెంట్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా ఎంపీలు కూర్చునే సీట్లను సర్దుబాటు చేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలకు రెండు ఛాంబర్లతో పాటు, గ్యాలరీని ఉపయోగించుకోనున్నారు. 60 మంది ఎంపీలు ఛాంబర్​లో, 51 మంది గ్యాలరీల్లో, మిగిలిన 132 మంది లోక్​సభ హాల్​లో కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోక్​సభలోనూ ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభ్యులు సభా కార్యక్రమాలు వీక్షించేలా డిజిటల్‌ స్క్రీన్‌లు, కరోనా నివారణకు అల్ట్రా వైలెట్‌ క్రిమిసంహారక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా ఒకే సమయంలో జరిగే లోక్​సభ, రాజ్యసభ సమావేశాలను విడతలవారీగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అయితే సభల నిర్వహణ సమయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.