నన్ను ఇంతటివాడ్ని చేసిన మహనీయుడు ఆయనే: మోహన్ బాబు
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. ఇవాళ దాసరి నారాయణ రావు గారి పుట్టినరోజు అని, ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. గురువు గారి ఆశీస్సులు తన కుటుంబానికి ఉంటాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
“తల్లిదండ్రులు నాకు భక్తవత్సలం అని పేరుపెట్టారు. కానీ నటుడిగా నాకు జన్మను ప్రసాదించిన గురువు దాసరి నారాయణరావు గారు ‘మోహన్ బాబు’ అని నామకరణం చేశారు. నాకు విలన్ గా, హీరోగా, కమెడియన్ గా, క్యారక్టర్ గా ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు ఇచ్చి నన్ను ఇంతటివాడ్ని చేసిన మహనీయుడు, తండ్రి లాంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు” అంటూ కీర్తించారు.
Tags: Mohan Babu, Dasari Narayana Rao, Birth Anniversary, Tollywood